Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొన్న ఈ సినిమా, ఆ తర్వాత నెగటివ్ జోన్లోకి వెళ్లడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. తొలి వారంలోనే తీవ్ర తడబాటుకు గురైన ఈ చిత్రం, చివరకు డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించడంతో, దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మలయాళం, హిందీ భాషలు, ఓవర్సీస్ మార్కెట్ కలిపి రూ.103 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్‌గా రూ.105 కోట్ల షేర్, రూ.210 కోట్ల గ్రాస్ తో థియేట్రికల్ జర్నీని ప్రారంభించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.43 కోట్ల నెట్ / రూ.105 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా భారీ నష్టాలతో ముగిసే అవకాశం ఉందని అంచనా. ‘అఖండ 2’ బాక్సాఫీస్ పరంగా నిరాశపరిచినా, నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ కెరీర్లో తొలిసారి 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అధిగమించారు. డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాతో కూడా ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
డిజాస్టర్ టాక్ మధ్య కూడా బాలయ్య సాధించిన ఈ ఘనతపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, బాలకృష్ణ స్టామినా, మార్కెట్ విలువ మరోసారి రుజువైందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే తాజాగా సినిమాపై మరింత ఆసక్తి పెంచేందుకు మేకర్స్ అఖండ 2 మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో బాలయ్య యాక్షన్ సీన్స్, బోయపాటి డైరెక్షన్, లొకేషన్ ఇవన్నీ కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులోని పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌ని జార్జియాలో రూపొందింగా, ఇవి అలరిస్తున్నాయి.