PM Modi : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతియుత పరిష్కారం భారతదేశం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చించారు.
రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా నేతలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ నడుమ ఉద్రిక్తతలకు పరిష్కారంపై భారతదేశం స్టాండ్‌ను ప్రధాని వివరించారు.
#WATCH | Prime Minister Narendra Modi holds a bilateral meeting with President of Ukraine Volodymyr Zelenskyy on the sidelines of the G7 Summit, in Italy. pic.twitter.com/lM4tw3rQNk
— ANI (@ANI) June 14, 2024
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలనే తాము కోరుకుంటున్నామని.. చర్చల ద్వారా, దౌత్య మార్గాల ద్వారా శాంతియుత పరిష్కారం దక్కాలని తాము భావిస్తున్నామని ప్రధాని మోదీ జలెన్స్కీకి తెలియజేశారు. సమావేశానికి ముందు నేతలిద్దరూ కలుసుకోగానే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని తమ మధ్య ఆప్యాయతను చాటారు. జెలెన్స్కీతో సమావేశానికి ముందు ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడి ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో భేటీ అయ్యారు.