Priests met PM Modi: ప్రధాని నరేంద్రమోదిని ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం పూజారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రధానిని శేష వస్త్రంతో సన్మానించారు. రెండు ఆలయాల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదాలను ప్రధానికి అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో ఆయనను ఆశీర్వదించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో వారి మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని వారితో కొంతసేపు ముచ్చటించారు. వారి మధ్య ఏ విషయంలో చర్చ జరిగిందనే వివరాలు వెల్లడికాలేదు.
#WATCH | Priests from Tirupati and Srisailam temples met Prime Minister Narendra Modi and gave him 'prasad' from the temples, in New Delhi today pic.twitter.com/H4ghFCmOS8
— ANI (@ANI) January 1, 2022