న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని రిశికేష్ పట్టణంలో గంగా హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ఓ శాస్త్రీయ నృత్యకారుడు తలపై దీపాలు వెలుగుతున్న హారతి పల్లాన్ని పెట్టుకుని నృత్యం చేస్తుండగా.. మరో నృత్యకారుడు తన రెండు చేతుల్లో దీపాలు పెట్టుకుని నృత్య ప్రదర్శన చేశాడు. గంగాదేవికి ఈ విధంగా హారతి సమర్పించడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్నది. కాగా, ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితోపాటు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ చేతుల్లో దీపాలు పట్టుకుని నిలబడ్డారు. ఈ హారతి సమర్పణ కార్యక్రమాన్ని కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
President Ram Nath Kovind performed 'Ganga Aarti' in Rishikesh. Uttarakhand CM Pushkar Singh Dhami was also present at the event. pic.twitter.com/zuM6HHPkjG
— ANI (@ANI) November 28, 2021