Naveen Patnaik : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం బీజేడీ శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన ఈ క్యాంపులో పలువురు బీజేడీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. తమ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
బీజేడీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నవీన్ పట్నాయక్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బీజేడీ ఒడిశాలో వరుసగా గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. దాంతో ఈ ఐదు పర్యాయాలు బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి పాలైంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
#WATCH | Odisha: On the birthday of party chief and former CM Naveen Patnaik, BJD organised blood donation camps in Bhubaneswar today. BJD MPs and MLAs also met him and extended him birthday greetings.
(Video: BJD) pic.twitter.com/Z4Jsfd9s0S
— ANI (@ANI) October 16, 2024