న్యూఢిల్లీ: మానవులతో సహా ఈ సృష్టిలో ఏ జీవి తల్లైనా తన పిల్లలను ఇతరుల బారి నుంచి రక్షించుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తన పిల్లలను తినేందుకు వస్తున్న ఒక పామును గమనించిన కోడి దానిని నిలువరించేందుకు తెగ పోరాడింది. 38 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిని పోస్ట్ చేసిన వ్యక్తి తల్లి ప్రేమ అని శీర్షిక పెట్టారు. భయం కంటే ప్రేమ బలమైన భావోద్వేగమని పేర్కొన్నారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. పాముపై కోడి గెలిచిందా, తన పిల్లలను రక్షించుకున్నదా అని కొందరు ఆరా తీశారు. తప్పకుండా పామును కోడి చంపి ఉంటుందని మరి కొందరు అభిప్రాయపడ్డారు.