ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఉదయం కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహంతో వీధులు నదులను తలపిస్తున్నాయి. దాంతో ఇండ్ల ముందు నిలిపి ఉంచిన కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
ముంబైలోని బొరివాలీ ఈస్ట్ ఏరియాలో రోడ్లపై నడుములోతు వరద నీరు ప్రవహిస్తున్నది. కండివాలీ ఈస్ట్ ఏరియాలోని హనుమాన్ నగర్లో పలు ఇండ్లలోకి వరదనీరు చేరింది. గాంధీ మార్కెట్ ఏరియాలో ప్రధాన రహదారి పూర్తిగా నీట మునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో వరదనీటికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | Maharashtra: Rainwater entered Mumbai's Borivali east area following a heavy downpour this morning pic.twitter.com/7295IL0K5K
— ANI (@ANI) July 18, 2021
#WATCH | A group of men were seen enjoying dips in the middle of the waterlogged king circle in Mumbai’s Sion this morning pic.twitter.com/heybEk4VN7
— ANI (@ANI) July 17, 2021
#WATCH | Maharashtra: Daily commuters' movement affected as roads waterlogged, in Gandhi Market area following incessant rainfall. pic.twitter.com/1LpwYNVK0j
— ANI (@ANI) July 17, 2021