పట్నా: మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం. ఇక్కడ రకరకాల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వేష భాషలు కలిగిన ప్రజలంతా కలగలిసి ఉంటున్నారు. పండుగలు పబ్బాలకు, పెండ్లిళ్లకు, ఇతర శుభాకార్యాలకు, చెడు కార్యాలకు వివిధ ప్రాంతాల ప్రజలు విభిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తుంటారు. అదేవిధంగా బీహార్ ప్రజలు కూడా వరి మొలక అలికే ముందు ఒక సంప్రదాయబద్ధమైన వేడుకను జరుపుకుంటారు. డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ వరిపంట సాగును మొదలెపెట్టేందకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
బీహార్లోని గయా ప్రాంతంలోగల ఓ గ్రామంలో అలాంటి సంప్రదాయ వేడుకను జరుపుకుంటున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. ఈ సంప్రదాయ వేడుక నిర్వహణ వెనుక రెండు బలమైన ఉద్దేశాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. అందులో మొదటిది పంట దిగుబడి బాగా రావాలని కాగా, కరోనా లాంటి మహమ్మారుల బారి నుంచి గ్రామాన్ని కాపాడుకోవాలనేది రెండోదని చెప్పారు. ప్రతి ఏటా ఈ ఆచార కార్యక్రమం జరుపుకోవడం అనాదిగా వస్తున్నదన్నారు.
#WATCH | Locals perform traditional rituals at the start of sowing season of paddy crops in Gaya, Bihar.
— ANI (@ANI) July 4, 2021
"There are 2 reasons for the rituals. One is to have a rich harvest. Two, these rituals will help our village remain safe from #COVID19. We do this every year," says a local pic.twitter.com/8EabbpnirX