Manipur CM | రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన మణిపూర్ సీఎం.. ఎందుకంటే..!
Manipur CM | తెగల మధ్య గొడవలతో ఇటీవల మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి (Manipur CM) బీరేన్ సింగ్ (Biren Singh) క్షమాపణలు చెప్పారు.
Manipur CM : తెగల మధ్య గొడవలతో ఇటీవల మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి (Manipur CM) బీరేన్ సింగ్ (Biren Singh) క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు ఎంతో కష్టంగా గడిచిపోయిందని, ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
తెగల వైరంతో దాదాపు 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని బీరేన్ సింగ్ చెప్పారు. చాలామంది ఇళ్లను వదిలిపెట్టి పోయారని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని, 625 మంది నిందితులు అరెస్టయ్యారని చెప్పారు. పోలీసులు మొత్తం 5,600 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు.
అయితే గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి నెలకొందని బీరేన్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగినంత భద్రతా సిబ్బందిని పంపిందని చెప్పారు. కొత్త సంవత్సరంలో పూర్తిస్థాయిలో శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన తప్పిదాలను క్షమించుదామని, చేదు జ్ఞాపకాలను మర్చిపోదామని చెప్పారు. అన్ని జాతుల ప్రజలు కలసికట్టుగా జీవించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సంవత్సరంలో అందరం కొత్త జీవితాలను ప్రారంభిద్దామని బీరెన్ సింగ్ పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

