Last sunset : ‘పరుగులు పెడుతది కాలమూ.. నీకోసం ఆగదు ఏ క్షణమూ’ అన్నట్లుగా సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు.. ఇలా కాలం కదిలిపోతూనే ఉంటుంది. సూర్యోదయాలు, సూర్యస్తమయాలు ఒకదాని వెంట ఒకటి నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఆగినా కాలం మాత్రం ఎవరి కోసం ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఓ ఏడాది గడిచిపోతుంది. మరో సంవత్సరం కొత్తగా వచ్చి చేరుతుంది.
ఇలా ఇప్పటివరకు క్రీస్తు శకంలో 2024 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు 2025వ ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. న్యూజిలాండ్‌లో ఇప్పటికే నూతన సంవత్సరం సంబురాలు జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో అన్ని దేశాల్లో కొత్త సంవత్సర సంబురాలు అంబరాన్ని అంటనున్నాయి. మనమూ సంబురాలకు కొన్ని గంటల దూరంలో ఉన్నాం.
కానీ అంతకంటే ముందు 2024 ఏడాదికి సంబంధించి సూర్యుడు ఆఖరిసారి అస్తమిస్తున్నాడు. న్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో, అస్సాం, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించాడు. మరికొన్ని నిమిషాల్లో దేశమంతటా సూర్యుడు అస్తమించనున్నాడు. ఈ ఏడాది ఆఖరి సూర్యాస్తమయానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు..
#WATCH | Odisha: As the Sun begins to dip below the horizon, it marks the last sunset of the year 2024.
Visuals from Shri Jagannath Puri Temple. pic.twitter.com/wBV7AYVSTl
— ANI (@ANI) December 31, 2024
#WATCH | As the Sun begins to dip below the horizon, it marks the last sunset of the year 2024; visuals from Akshardham area pic.twitter.com/lK8HhPHl0U
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Sun sets to mark the last evening of the year 2024
Visuals from Central Delhi pic.twitter.com/Tpfi8hmUwq
— ANI (@ANI) December 31, 2024
#WATCH | West Bengal: As the Sun begins to dip below the horizon, it marks the last sunset of the year 2024
Visuals from the banks of Hooghly River, Kolkata pic.twitter.com/9ZfUU4lD2X
— ANI (@ANI) December 31, 2024
#WATCH | The setting Sun marks the last evening of the year 2024
Visuals from Bhubaneswar, Odisha pic.twitter.com/JbhdXA2804
— ANI (@ANI) December 31, 2024
#WATCH | As the Sun begins to dip below the horizon, it marks the last sunset of the year 2024
Visuals from Jalpaiguri, West Bengal pic.twitter.com/2IogJSDQ6L
— ANI (@ANI) December 31, 2024