కన్నూర్: కేరళలోని కన్నూర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగింది. ఓ ఫర్నీచర్ దుకాణం గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు మూడు గంటలపాటు ఫైరింజన్ల సాయంతో శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీ నష్టం జరిగినప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.