Protest : కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అశోక్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు కార్లకు బదులుగా ఎడ్లబండిపై ఫ్రీడం పార్క్ ఏరియాకు వచ్చారు. అప్పటికే భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడ గుమిగూడారు. ఈ సందర్భంగా కర్ణాటక సర్కారు వ్యతిరేక నినాదాలతో ఫ్రీడమ్ పార్క్ ఏరియా మార్మోగింది.
కర్ణాటక ప్రభుత్వం రెండు రోజులు క్రితం పెట్రోల్, డీజిల్ సేల్స్ ట్యాక్స్‌ను పెంచింది. దాంతో పెట్రోల్, డీజీల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున ధర పెరిగింది. ఈ క్రమంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. బీజేపీ నేతల ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Bengaluru: Karnataka Assembly LoP R Ashok, along with other BJP workers, arrives at Freedom Park with bullock cart to protest against the petrol and diesel price hike in the state. pic.twitter.com/j8YGaqkzym
— ANI (@ANI) June 17, 2024