Vijayadashmi : దేశవ్యాప్తంగా రేపు (శనివారం) విజయదశమి వేడుకలు (Dussehra celebrations) ఘనంగా జరగనున్నాయి. అందరూ పిల్లాపాపలతో కలిసి దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ చాలా మంది తమ కార్యాలయాల్లో, పని ప్రాంతాల్లో విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం కలబురగి సిటీ (Kalaburagi City) లోని పోలీస్ కమిషనరేట్ (Police Commissioner’s office) లో కూడా దసరా వేడుకలు జరిగాయి.
కలబురగి పోలీస్ కమిషనర్ డాక్టర్ శరణప్ప ఎస్డీ సమక్షంలో కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజ అనంతరం కలబురగి పోలీస్ కమిషనర్ శరణప్ప కార్యాలయంలోని ఆయుధాలపై పురోహితులు వేదమంత్రాలతో పూజించి ఇచ్చిన అక్షతలను చల్లారు. చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ తాము కార్యాలయంలో దసరా పండుగ జరుపుకున్నామని, ఈ సందర్భంగా ఆయుధ పూజ చేశామని అన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Karnataka | On the occasion of Vijayadashmi, Kalaburagi City Police Commissioner Dr. Sharanappa SD, performed ‘shastra pooja’ at the City Police Commissioner’s office pic.twitter.com/WRPpcgH01w
— ANI (@ANI) October 11, 2024