Justice D Krishnakumar : మణిపూర్ హైకోర్టు (Manipur High Court) 8వ ప్రధాన న్యాయమూర్తి (Chief Justies) గా జస్టిస్ క్రిష్ణకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. మణిపూర్ గవర్నర్ (Manipur Governor) లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Laxman Prasad Acharya) ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఇప్పటిదాకా మణిపూర్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ (Justies Siddharth Mridul) గురువారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ క్రిష్ణకుమార్ను చీఫ్ జస్టిస్‌గా నియమించారు. సిద్ధార్థ్ మృదుల్ పదవీ విరమణ నేపథ్యంలో ఈ నెల 18న ఆయన స్థానంలో క్రిష్ణకుమార్ పేరును సుప్రీంకోర్టు కోలీజియం ప్రతిపాదించింది. ఈ నెల 20న ఆయనను మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించారు.
#WATCH | Imphal: Justice D Krishnakumar takes the oath as the 8th Chief Justice of the Manipur High Court at the Durbar Hall in Raj Bhavan pic.twitter.com/xnIQYUBe7F
— ANI (@ANI) November 22, 2024