సహరాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లా దేవ్‌బంధ్ ఏరియాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ స్పృహలోనే ఉన్నారు. తనపై హత్యాయత్నం గురించి ఆస్పత్రిలో వైద్యులకు వివరించారు. అయితే తనపై కాల్పులు జరిపిన వ్యక్తులను తాను సరిగా గుర్తించలేదని, తన మనుషులు గుర్తుపట్టారని చెప్పారు.
‘మేం కారులో వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు రన్నింగ్‌లోనే నాపై కాల్పులు జరిపారు. దాంతో మేం వెంటనే యూ టర్న్ తీసుకున్నాం. వాళ్ల కారు సహరాన్పూర్ వైపు వెళ్లిపోయింది. ఘటన జరిగిన సమయంలో నేను, నా తమ్ముడు సహా ఐదుగురం కారులో ఉన్నాం’ అని చంద్రశేఖర్ ఆజాద్ గాయాల నొప్పితో మూలుగుతూనే వైద్యులకు వివరించారు.
కాగా, బుధవారం సాయంత్రం చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై దుండగులు దాడి చేశారు. ఆజాద్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సహరాన్‌పూర్‌లోని దేవ్బంధ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయనకు సహరాన్‌పూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
#WATCH | “I don’t remember well but my people identified them. Their car went towards Saharanpur. We took a U-Turn. Five of us, including my younger brother, were in the car when the incident occurred..,” says Bhim Army leader and Aazad Samaj Party – Kanshi Ram chief, Chandra… pic.twitter.com/MLeVR8poaN
— ANI (@ANI) June 28, 2023