షిమ్లా: ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని రాంపూర్ పట్టణంలో ఇటీవల కురిసిన ఎడతెరపిలేని వర్షాలు స్థానికులకు కన్నీటి వ్యథనే మిగిల్చాయి. పట్టణంలోని దాదాపు 100కు పైగా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దాంతో ఆయా ఇళ్ల జనం తాము ఇష్టంగా నిర్మించుకున్న ఇళ్లను వదిలి బయట తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివసించాల్సిన దుస్థితి ఏర్పడింది.
కొండ ప్రాంతమైన రాంపూర్‌లో ఇటీవల కురిసిన వర్షాలవల్ల ఇళ్లకింద మట్టి కరిగి జారిపోయింది. దాంతో ఇళ్లు కుంగిపోయి గోడలకు, ఫ్లోర్లకు పగుళ్లు వచ్చాయి. కొన్ని ఇళ్లయితే ఇంకా ఏమాత్రం కుంగినా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. దాంతో ఇళ్లలోని వారు తాత్కాలిక ఆవాసాల్లో ఉంటున్నారు. ఇళ్లలో పగుళ్లకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Shimla, Himachal Pradesh: Houses in Rampur develop cracks following incessant rainfall pic.twitter.com/AsvVyEoZmY
— ANI (@ANI) July 31, 2023