గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సిటీలో ఇవాళ ఉదయం కుండపోత వర్షం కురుసింది. తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై పెద్దఎత్తున వరదనీరు చేరింది. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కింది వీడియో ద్వారా నర్సింగపూర్ చౌక్ ఏరియాలో రహదారిపై వరద నీరు నిలిచిన దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు. రోడ్డుపై దాదాపు రెండు అడుగుల లోతు నీరు నిలవడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడే మొరాయించాయి.
#WATCH | Heavy waterlogging in parts of Gurugram after rain lashed the city
(Visuals from Narsinghpur Chowk) pic.twitter.com/B8Q7IlC8oh
— ANI (@ANI) June 21, 2023