న్యూఢిల్లీ: ఢిల్లీ-గుర్గావ్ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జాతీయ రహదారులపై రైతుల ఆందోళన, సాయంత్రం వేళ కురిసిన వర్షం కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన దృశ్యాలను ఓ జాతీయ మీడియా ఏజెన్సీ తన కెమెరాలో బంధించింది. ట్రాఫిక్ జామ్‌లో వాహనదారులు ఇబ్బందులు పడినప్పటికీ ఇండికేటర్ల కాంతులు రోడ్డుపై నిప్పులు పరిచినట్లుగా ఉన్న దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
#WATCH | Heavy traffic jam seen at Gurugram-Delhi border pic.twitter.com/GOPnVbqnIj
— ANI (@ANI) October 1, 2021