Road accident : తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎడమ భాగం ఒక అడుగు మేర లారీకి తగిలి దాదాపు బస్సులో మధ్య వరకు చీల్చుకుంటూ పోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తమిళానాడులోని మధురాంతకంలో చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న పాండలమ్ పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Tamil Nadu: Four people died and more than 15 were injured after a bus collided with a lorry in Maduranthakam on the Chennai-Trichy National Highway as it lost control while trying to overtake. The injured have been taken to Chengalpattu Government Hospital. More details… pic.twitter.com/J7S4W4NXQv
— ANI (@ANI) May 16, 2024