బెంగళూరు: మూడు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీ (Laxman Savadi) ఇవాళ ఉదయం ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. బెంగళూరులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య (Siddaramaiah) నివాసంలో ఈ భేటీ జరిగింది. సిద్ధరామయ్య, లక్ష్మణ్ సవాడీతోపాటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar), కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా (Randeep Surjewala) ఈ భేటీలో పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అథానీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిన లక్ష్మణ్ సవాడీకి భారతీయ జనతాపార్టీ మొండిచేయి చూపింది. దాంతో అసంతృప్తి చెందిన ఆయన ఈ నెల 12న తన ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతాడని వార్తలు వినిపిస్తున్నాయి.
#WATCH | Former Karnataka Deputy CM Laxman Savadi meets State Congress president DK Shivakumar & State LoP Siddaramaiah at the latter’s residence in Bengaluru
Laxman Savadi on April 12 resigned as Legislative Council member & from the primary membership of the BJP after losing… pic.twitter.com/fvaEm75IKm
— ANI (@ANI) April 14, 2023