Achrekar memorial : చిన్ననాటి నుంచి తనకు క్రికెట్లో ఓనమాలు నేర్పించి, ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్‌గా తీర్చిదిద్దిన కోచ్ రమాకాంత్ అచ్రేకర్ (Ramakant Achrekar) స్మారకాన్ని క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఆవిష్కరించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్‌లో ఈ స్మారకాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే (Raj Thackeray) కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. క్రికెట్‌కు, నా జీవితానికి ఎంతో మేలు చేసిన ఆ మహనీయుడికి ఇవాళ స్మారకాన్ని ఆవిష్కరించి, నివాళి అర్పించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పారు. ఈ స్మారకం ఆవిష్కరణ కార్యక్రమంలో మీరంతా పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి సచిన్ అన్నారు.
సచిన్‌కు క్రికెట్ కోచ్ అయిన రమాకాంత్ అచ్రేకర్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ శివాజీ పార్కులో ఆయన స్మారకాన్ని ఆవిష్కరించారు. అచ్రేకర్ అందించిన సేవలకు గుర్తింపుగా 1990లో ఆయనను ప్రతిష్ఠాత్మక ద్రోణాచార్య అవార్డుతో సత్కరించారు. 2010లో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2019 జనవరిలో అచ్రేకర్ మరణించారు. అచ్రేకర్ సచిన్‌తోపాటు వినోద్ కాంబ్లీ, సంజయ్ బంగర్, రమేశ్ పవార్, అజిత్ అగార్కర్ లాంటి ఎంతో మందిని మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దారు.
#WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar and MNS chief Raj Thackeray unveiled cricket coach Ramakant Achrekar’s memorial in Mumbai.
(Source: Shivaji Park Gymkhana) pic.twitter.com/8PEZy5QsDZ
— ANI (@ANI) December 3, 2024