Fire accident : పంజాబ్లోని పటియాలా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కాసేపట్లోనే పరిసరాలకు మంటలు విస్తరించాయి. ఈ ప్రమాదంలో మార్కెట్లోని వస్త్ర దుకాణాల సముదాయాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. కాగా, ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని, కానీ ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.
#WATCH | Punjab: Fire broke out at a flea market in Patiala. Fire tenders on the spot. pic.twitter.com/XBoHoehTzu
— ANI (@ANI) May 31, 2024