థానే: ఓ ప్యాసింజర్ బస్సు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఆ బస్సు ఇంజిన్లో సడెన్గా పొగలు రావడం మొదలైంది. అది గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించుతుండగానే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. కానీ ప్రయాణికులంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని థానే సిటీలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. థానే మున్సిపల్ కార్పొరేషన్ ఆ కార్పోరేషన్ ప్రజల సౌకర్యార్థం కొన్ని బస్సులను నడుపుతున్నది. ఈ క్రమంలోనే శనివారం ప్రయాణికులతో వెళ్తున్న మున్సిపల్ కార్పోరేషన్ బస్సు ప్రమాదానికి గురైంది. థానే సిటీలో సెంట్రల్ గ్రౌండ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో పెనుముప్పు తప్పింది. బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగుతున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Maharashtra | Fire breaks out in the engine of a Thane Municipal Transport (TMT) bus near Central Ground in Thane. 40-50 passengers were travelling on the bus but they got off the vehicle on time. No injuries reported.
(Video: Thane Municipal Corporation) pic.twitter.com/IECuefbs35
— ANI (@ANI) July 30, 2023