Fire accident : వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యర్థాలను పారవేసే ఓ స్క్రాప్ యార్డు (Scrap yard) లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. క్షణాల్లో మంటలు ఆ ఏరియా అంతటా వ్యాపించి అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. హర్యానా (Haryana) రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram) జిల్లాలోని బార్ గుజ్జర్ (Bar Gujjar) ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టంగానీ జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికిగల కారణం తెలియాల్సి ఉందని చెప్పారు.
#WATCH | Haryana: Fire breaks out in the Bar Gujjar area of Gurugram. Fire department personnel present at the spot
(Source: Fire Officer Gurugram) pic.twitter.com/NkRm1dW0kb
— ANI (@ANI) December 16, 2025