న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగ్ నగర్ ఏరియాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆ ఫ్యాక్టరీ పరసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు.
హుటాహుటిన ఫైర్ ఇంజిన్లతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా, షూ ఫ్యాక్టరీ తగులబడిపోతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Delhi | Fire breaks out in a shoe factory in Udyog Nagar. Fire tenders are present at the spot, fire fighting operations are underway. Details awaited. pic.twitter.com/3jTKCRJhK7
— ANI (@ANI) July 30, 2023