హౌరా: పశ్చిమబెంగాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హౌరా నగరంలోని దొమ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ప్రమాదానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.
#WATCH | Fire breaks out in a chemical factory located under the limits of the Domjur police station of Howrah. The cause of the fire is yet to be ascertained#WestBengal pic.twitter.com/zVJo8Q5av0
— ANI (@ANI) June 10, 2023