న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘాలు కమ్మింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో దుమ్ము తుఫాన్ చెలరేగింది. దాంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాగా, మరికొన్ని గంటల్లో ఢిల్లీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, దుమ్ము తుఫాన్ కూడా కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్తోపాటు పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
#WATCH | Dust storm and strong winds hit parts of Delhi; visuals from Janpath
— ANI (@ANI) May 30, 2021
As per India Meteorological Department (IMD), thunderstorm/duststorm with light to moderate intensity rain & winds likely to occur over & adjoining areas of Delhi NCR during the next 2 hours pic.twitter.com/t12lriaJGK