Tomatoe sales : దేశ రాజధాని ఢిల్లీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొనబోయినా కిలో ధర డెబ్భై, ఎనభై రూపాయలకు తక్కువ లేదు. ఇక టమాటా ధరలైతే ఢిల్లీ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా రూ.100కు పైనే పలుకుతోంది. దాంతో కూరల్లో ఎక్కువగా ఉపయోపడే టమాటా సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో సామాన్యులకు తక్కువ ధరకు టమాటాలు అందించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (NCCF)’ వాహనాల ద్వారా రూ.60 కే కిలో టమాటాలు అమ్మేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని సోమవారం ఢిల్లీలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా సరఫరాల శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కిలో టమాటాలను వినియోగదారుడికి విక్రయించారు.
#WATCH | Delhi | NCCF vans to sell tomatoes at Rs 60 per kg in Delhi from today.
Union Minister of Consumer Affairs, Food and Public Distribution, Pralhad Joshi flagged off the vans carrying tomatoes today. pic.twitter.com/2Maln9lA3a
— ANI (@ANI) July 29, 2024