Congress MP | పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత..!
Congress MP | లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
Congress MP : లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సిట్టింగ్ ఎంపీ రణ్వీత్ సింగ్ బిట్టూ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బిట్టూ 2021 మార్చి నుంచి జూలై వరకు కాంగ్రెస్ లోక్సభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
రణ్వీత్ సింగ్ బిట్టూ ప్రస్తుతం లూథియానా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా బిట్టూ ఇక్కడి నుంచే విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అంతకుముందు 2009లో ఆయన ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
ఇలా వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బిట్టూ ఇప్పుడు పార్టీ మారి బీజేపీలో చేరారు. 2021 జనవరిలో జన్ సంసద్ కార్యక్రమం సందర్భంగా బిట్టూపై దాడి జరిగింది. ప్రస్తుతం బిట్టూ పార్టీని వీడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Delhi | Congress Lok Sabha MP Ravneet Singh Bittu joins the BJP. pic.twitter.com/RcLPyPJ4i0
— ANI (@ANI) March 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

