రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో హరేలీ పండుగను ( Hareli festival ) ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది తమ వ్యవసాయ సంబంధ పనిముట్లను, గోవులను పూజిస్తూ హరేలి పండుగ జరుపుకోవడం ఛత్తీస్‌గఢ్‌తోపాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తున్నది. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు ఘనంగా హరేలీ పండుగ జరుపుకుంటున్నారు. ఆలయాల్లో తమ వ్యవసాయ సంబంధ పనిముట్లను ఉంచి దైవానికి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేశారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ సంబరాల్లో మునిగితేలారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన హరేలీ సంబురాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా పాల్గొన్నారు. జనంతో కలిసి ఆయన కూడా నృత్యం చేశారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH Chhattisgarh Chief Minister Bhupesh Baghel takes part in Hareli festival (of worshipping farm equipment and cows) celebrations today, in Raipur pic.twitter.com/0SARUhfkqt
— ANI (@ANI) August 8, 2021