Delhi speaker : ఢిల్లీ (Delhi) రాజకీయ వర్గాల్లో ముందు నుంచి చర్చ జరిగినట్టుగానే బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) విజేందర్ గుప్తా (Vijender Gupta) కు అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) పదవి దక్కింది. విజేందర్ గుప్తాను స్పీకర్గా ఎన్నుకున్న అనంతరం సీఎం రేఖా గుప్తా (Rekha Gupta), ప్రతిపక్ష నాయకురాలు అతిషి సింగ్ (Atishi Singh) ఆయనను పోడియం మీదకు తీసుకెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలను మీరు కింది వీడియోలో చూడవచ్చు..
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ మహిళా ఎమ్మెల్యే రేఖా గుప్తాకు సీఎం పదవి దక్కింది.
కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత తొలిసారి ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం మూడు రోజులపాటు ఈ అసెంబ్లీ సెషన్ కొనసాగనుంది. తొలి రోజు ప్రొటెం స్పీకర్ను ఎన్నుకోగా ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారాలు చేయించారు. ఆ తర్వాత స్పీకర్ను ఎన్నుకున్నారు. రేపు అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం చేయనున్నారు.
#WATCH | BJP MLA Vijender Gupta elected as the Speaker of the Delhi Legislative Assembly
CM Rekha Gupta and LoP in Delhi Assembly, Atishi, accompanied him to the Chair.
(Source: Delhi Assembly) pic.twitter.com/lfCwgjx3og
— ANI (@ANI) February 24, 2025