Delhi Mayor : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కు నూతన మేయర్ (New Mayor) గా బీజేపీ (BJP) సీనియర్ నాయకుడు (Senior leader), మాజీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ (Raja Iqbal Singh) ఎంపియ్యారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పోస్టును కూడా బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి జైభగవాన్ యాదవ్ (Jai Bhagvan Yadav) డిప్యూటీ మేయర్ (Deputy Mayor) గా ఎన్నికయ్యారు. ఇప్పటికే కేంద్రంలో, ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారం కూడా బీజేపీకే దక్కింది. దాంతో ఎంసీడీలో త్రిపుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటైనట్లయ్యింది.
కాగా ఎంసీడీలో మొత్తం సంఖ్య 250. అందులో నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా ఎన్నికయ్యారు. దాంతో ప్రస్తుతం 238 మంది సభ్యులు ఉన్నారు. అందులో బీజేపీ సభ్యులు 117 మంది, ఆప్ సభ్యులు 113 మంది. మిగతా 8 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. వీరికి తోడు ఢిల్లీకి చెందిన ఏడుగురు లోక్‌సభ్య సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ స్పీకర్ వీరేంద్ర సచ్దేవ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
సంఖ్యా బలం తక్కువగా ఉన్న కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మేయర్ ఎన్నికల్లో పోటీపడలేదు. ఇవాళ జరిగిన ఓటింగ్‌ను కూడా ఆప్ బహిష్కరించింది. బీజేపీకి 117 మంది కౌన్సిలర్లతోపాటు 10 మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే బీజేపీ మొత్తం బలం 134గా ఉంది. దాంతో బీజేపీ గెలుపు కాయమని తేలిపోయింది. అందుకే ఆప్ పోటీకి, ఓటింగ్‌కు దూరంగా ఉంది.
#WATCH | BJP candidate Raja Iqbal Singh elected as Delhi’s new Mayor. pic.twitter.com/y0jwWG10eA
— ANI (@ANI) April 25, 2025