బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒరిగిన మరో భవనాన్ని అధికారులు బుధవారం కూల్చివేశారు. పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్‌లోని నాలుగంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ మంగళవారం రాత్రి పాక్షికంగా ఒరిగింది. అది కూలేందుకు సిద్ధంగా ఉండటంతో అందులో ఉండే వారిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. సమీపంలోని ఇండ్లలో ఉండే వారిని కూడా మరోచోటకు తరలించారు. వారికి వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అధికారులు జేసీబీ సహాయంలో ఆ బిల్డింగ్‌ను పూర్తిగా కూల్చివేశారు.
కాగా, గత గురువారం బెంగళూరులోని కస్తూరి నగర్లో మూడంతస్తుల బిల్డింగ్ కూలింది. గత 15 రోజుల్లో కూలిన భవనాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ బిల్డింగ్లు కూలడానికి భారీ వర్షాలే కారణమని అధికారులు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి కూల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
#WATCH | Karnataka: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) demolished building in Vrushabhavathi ward near Shankar Nag bus stand in Bengaluru, earlier today. pic.twitter.com/bTk8dRKuli
— ANI (@ANI) October 13, 2021