BJP convention: దేశ రాజధాని ఢిల్లీలో ‘బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ రెండో రోజు సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. జైన మత 108వ ఆచార్య విద్యాసాగర్ జీ మహరాజ్ మరణం గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభీష్ఠానుసారం దేహాన్ని విడిచివెళ్లిన విద్యాసాగర్ మహారాజ్ జీ మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
విద్యాసాగర్ మహరాజ్ మరణానికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాట్టిద్దామని పార్టీ కార్యవర్గానికి సూచించారు. దాంతో పార్టీ సభ్యులంతా లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నేతలు మౌనం పాటించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.