ఇటానగర్: అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని నహర్లాగున్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. ముందుగా రెండు దుకాణాల్లో మొదలైన మంటలు.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడంతో పరిసరాలకు విస్తరించాయి.
దాంతో ఆ ఏరియాలోని మొత్తం 700 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత రెండు గంటలపాటు మంటలు రెండు దుకాణాలకే పరిమితమయ్యాయని, అయితే, ఫైర్ డిపార్టుమెంట్ వైఫల్యంవల్ల ఆ తర్వాత చుట్టుపక్కల అన్ని దుకాణాలకు విస్తరించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినా, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియలేదు.
#WATCH | Arunachal Pradesh: A massive fire broke out in Itanagar’s Naharlagun due to unknown reasons. Over 700 shops burnt to ashes; however, no casualties reported yet
As per sources, fire engulfed only 2 shops in the initial 2hrs, but the fire dept failed to control the spread pic.twitter.com/edeFudEXHl
— ANI (@ANI) October 25, 2022