న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక వాడలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో చెలరేగిన మంటలు క్రమంగా పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దాదాపు 20కి పైగా ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
#WATCH | A massive fire broke out in a factory in Bawana industrial area of Delhi today. 20 fire tenders rushed to the site. No injuries or casualties reported. Details awaited. pic.twitter.com/xDq1crdieA
— ANI (@ANI) November 4, 2023