Fire in Car : ఈ మధ్య కాలంలో రోడ్లపై పరుగులు పెడుతుండగానే వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బస్సులు, కార్లు, బైకులు అన్న తేడా లేకుండా అన్ని రకాల వాహనాలు ఇలాంటి అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నాయి. కొన్ని ఘటనల్లో భారీగా ప్రాణ నష్టం కూడా జరిగింది. మెజారిటీ ఘటనల్లో మాత్రం ప్రాణ నష్టం తప్పింది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై రయ్యిమని దూసుకెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కారును ఆపేసి బయటికి పరుగులు తీశాడు. ఆ తర్వాత మంటలు మరింత చెలరేగడంతో కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జోగేశ్వరీ బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
#WATCH | Maharashtra: A car caught fire and burnt to ashes on Jogeshwari Bridge in Mumbai
More details awaited. https://t.co/4iQGP3ageL pic.twitter.com/rat7DhNGeK
— ANI (@ANI) December 9, 2024