Bus accident : స్కూల్ విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లిన ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 60 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు నిదానంగా ఒకవైపు ఒరిగిపోవడంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, లేదంటే మరింత ఘోరం జరిగేదని బాధిత విద్యార్థులు చెబుతున్నారు.
కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు గురువారం ఉదయం హంపి, విజయపురలకు విహారయాత్రకు తీసుకెళ్లారు. బస్సు కొప్పాల్లోని గంగావతి సమీపానికి చేరుకోగానే బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులతోపాటు ఏడుగురు ఉపాధ్యాయులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Karnataka | 60 students and seven teachers of Vasavi School escaped with minor injuries after a bus taking them to Hampi and Vijayapura for an educational school trip slid off the road near Gangavathi in Koppal, early morning today pic.twitter.com/dFjzGriVIU
— ANI (@ANI) November 28, 2024