న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ గందరగోళం నెలకొన్నది. చైర్మన్ జగదీప్ ధన్కడ్.. ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే(Dhankhar Vs Kharge) మధ్య మాటల యుద్ధం సాగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వాయిదా తీర్మానాలను స్వీకరించాలని విపక్షాలు కోరాయి. ఆ సమయంలో చైర్లో ఉన్న ధన్కడ్ మాట్లాడుతూ.. గడిచిన 30 ఏండ్లలో ఎన్ని సార్లు రూల్ 267 వాడారో తనకు తెలుసు అన్నారు. మీ విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలి వేస్తున్నట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో రూల్ 267 కింద వాయిదా తీర్మానాలను ఇచ్చినట్లు ధన్కడ్ పేర్కొన్నారు.
విపక్షాలు పట్టుపట్టడంతో.. చైర్మెన్ ధన్కడ్ సీరియస్ అయ్యారు. నేను రైతు బిడ్డను, నేను ఎటువంటి బలహీనతను ప్రదర్శించబోనని ధన్కడ్ తెలిపారు. ఈ దేశం కోసం ప్రాణాలిస్తాను, ఓ రైతు బిడ్డ ఎలా ఈ స్థానంలో కూర్చున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మీ వెకిలి చేష్టలు అందరికీ తెలుసు అని, నేను చాలా ఓపిక పట్టాను, కానీ నేటి రైతు కేవలం పంటపొలాలకే పరిమితం కాడు అని అన్నారు. రూల్స్‌ను చదువుకోవాలని, ఒకవేళ మోషన్ మూవ్ చేస్తే అది 14 రోజులు పడుతుందన్నారు. మీరు టైం తీసుకుని వచ్చి చర్చించండి, లేదంటే నేనే మీవద్దకు వచ్చి చర్చిస్తానన్నారు.
SHAME 🚨🚨
Mallikarjun Kharge was delivering a speech but Vice President Dhankar stopped him midway
He started playing victim card & also attacked the opposition ⚡
Also notice how the camera was focused on VP all time ⚡
IS THIS NOT DICTATORSHIP? 👏 pic.twitter.com/Ukd8KMYysY
— Ankit Mayank (@mr_mayank) December 13, 2024
ఆ సమయంలో ఖర్గే, ధన్కడ్ మధ్య మళ్లీ మాటలు పెరిగాయి. మీ రైతు బిడ్డ అయితే, నేను ఓ రైతుకూలీ కుమారుడిని అని ఖర్గే అన్నారు. రైతు బిడ్డను అవమానిస్తున్నట్లు మీరు ఆరోపిస్తున్నారని, కానీ నేను ఓ కూలీ బిడ్డను అని మీకు చెబుతున్నాని ఖర్గే అన్నారు. మీరు చేసే ప్రశంసలు వినడానికి మేం సభకు రాలేదని ఖర్గే పేర్కొన్నారు. మీరు ఎటువంటి ప్రశంసలు వినాలనుకుంటున్నారో తనకు తెలుసు అని ధన్కడ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు తనను వ్యక్తిగతంగా బాధకు గురిచేస్తోందని ధన్కడ్ అన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావడం తప్పు కాదు అని, కానీ రాజ్యాంగ వ్యతిరేకంగా ఆ ప్రక్రియ సాగుతోందన్నారు. ప్రతి రోజు చైర్మెన్‌పై ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. తన ఛాంబర్‌కు వచ్చి మాట్లాడాలని, అధికార, ప్రతిపక్ష నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ధన్కడ్ తెలిపారు.ఆ సమయంలో ఖర్గే మాట్లాడుతూ.. చైర్మెన్ తనను గౌరవించడం లేదని, అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా గౌరవిస్తానని, మీరు నన్ను అవమానిస్తున్నారని అన్నారు. ఆందోళన కొనసాగడడంతో.. సభను సోమవారానికి వాయిదా వేశారు.