న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డ్ అధికారాలకు కోత పెడుతూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ‘వక్ఫ్ సవరణ బిల్లు’పై శుక్రవారం నాటి ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ (జేపీసీ) సమావేశం వాడివేడిగా సాగింది. బీజేపీ, విపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఆగ్రహానికి గురైన విపక్ష సభ్యులు కొంతసేపు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగింపుపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తొలగిస్తే ఉత్తరప్రదే శ్లో లక్షకుపైగా వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యే అవకాశముందని అన్నారు. మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, బీజేపీ సభ్యుడు దిలీప్ సైకియా మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. జేపీసీ కమిటీ సెప్టెంబర్ 5-6న మళ్లీ సమావేశం కానున్నది.