కోల్కతా: ఏప్రిల్ 11: వక్ఫ్ బిల్లుకు నిరసనగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నింతిటా రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలుపై రాళ్లతో దాడి చేసిన మూకలు స్టేషన్ ఆస్తిని ధ్వంసం చేశాయి.
మూకలు సృష్టించిన విధ్వంసంలో దాదాపు 10 మంది పోలీసులు గాయపడ్డారు. హింసను అదుపు చేసేందుకు సరిహద్దు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన కారణంగా రెండు రైళ్లు రద్దు కాగా ఐదు రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. మూకల దాడిలో కొందరు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.