న్యూఢిల్లీ: భారత్, అమెరికాలలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అంగద్ చండోక్ సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మన దేశంలో బ్యాంకులను మోసగించడంతోపాటు, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.
ఆయన టెక్ సపోర్ట్ ముసుగులో అమెరికాలో కూడా మోసాలకు పాల్పడ్డాడు. కాలిఫోర్నియాలో మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. అమెరికా కోర్టు అతనికి 2022లో ఆరేండ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా సాయంతో సీబీఐ అతనిని భారత్‌కు రప్పించి, అరెస్ట్ చేసింది.