అహ్మదాబాద్: ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో గోడ, మట్టి దిబ్బలు కూలాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది కార్మికులు మరణించారు. (Labourers Killed) మరో వ్యక్తికి గాయాలయ్యాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశారు. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కడి పట్టణం సమీపంలోని జసల్‌పూర్ గ్రామంలో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాడు. శనివారం అక్కడ ట్యాంక్ నిర్మాణం కోసం 16 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. అయితే పక్కన ఉన్న గోడ కూలడంతోపాటు మట్టి పెళ్లలు ఆ కూలీలపై పడ్డాయి. దీంతో కూలీలు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రెండు గంటలపాటు సహాయక చర్యలు చేపట్టారు. తొమ్మిది మంది కూలీల మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన ఒక వ్యక్తిని రక్షించారు. మృతులంతా 20 నుంచి 30 ఏళ్ల వయస్కులని, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువ మంది గుజరాత్‌లోని దాహోద్‌కు చెందినవారని, రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు కూలీలు కూడా ఉన్నారని చెప్పారు.
మరోవైపు గుజరాత్ సీఎంతోపాటు ప్రధాని మోదీ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంవో కార్యాలయం పేర్కొంది.
An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Mehsana, Gujarat. Rs. 50,000 would be given to those injured. https://t.co/KUJqI32dEW
— PMO India (@PMOIndia) October 12, 2024