National Voters Day | న్యూఢిల్లీ: దేశంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. ఈ సంఖ్య ప్రస్తుతం 99.1 కోట్లకు పెరిగింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ బుధవారం ఈ వివరాలను వెల్లడించింది.
18-29 సంవత్సరాల మధ్య వయస్కులు 21.7 కోట్ల మంది ఉన్నారు. స్త్రీ, పురుష నిష్పత్తి 2024లో 948 ఉండేది. ప్రస్తుతం ఇది 954కు పెరిగింది. ఈ నిష్పత్తి 2019లో 928 కాగా, 2024నాటికి 948కి పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయానికి 48,044 మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం ఓటర్లలో 47.15 కోట్ల మంది మహిళలు, 49.72 కోట్ల మంది పురుషులు ఉండేవారు.