Volcano eruption : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన హవాయి ద్వీపం (Hawai Island) లో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలవేయ (Kilauea volcano) మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికివస్తోంది. వెయ్యి అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది.
అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టంచేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలవేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది.