Viral Video | అరిటాకు హల్వా.. : నెటిజన్ల రియాక్షన్ నెక్ట్స్ లెవెల్
Viral Video : భారత్‌లో ప్రముఖ స్వీట్లలో హల్వా ముందువరుసలో నిలుస్తుంది. ఈ స్వీట్‌ను పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తయారుచేస్తుంటారు.
Viral Video : భారత్‌లో ప్రముఖ స్వీట్లలో హల్వా ముందువరుసలో నిలుస్తుంది. ఈ స్వీట్‌ను పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తయారుచేస్తుంటారు. అట్టా హల్వా నుంచి పైనాపిల్ హల్వా వరకూ ఎన్నో వెరైటీల్లో ఈ డిష్ పలువురిని ఊరిస్తుంటుంది. ఎన్నో రకాల హల్వాలు స్వీట్ ప్రియులను అలరించినా తాజాగా అరిటాకు హల్వాపై నెట్టింట హాట్ డిబేట్ సాగుతోంది. ఈ అసాధారణ డిష్‌ను ఇటీవల ఓ వ్లాగర్ ట్రై చేశారు.
అరిటాకు హల్వాను తయారుచేసే విధానాన్ని ఇన్‌స్టా రీల్లో రికార్డు చేశారు. గ్రేట్ ఇండియన్ ఏఎస్ఎంఆర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోలో ముందుగా వ్లాగర్ అరిటాకును శుభ్రం చేయడం కనిపిస్తుంది. ఆపై అరిటాకును కట్ చేసి రోల్స్‌గా చేసి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ పోసి మిక్సీలో వేస్తాడు. ఆపై ప్యాన్‌లో నేయిని వేడిచేసి ఈ గ్రీన్ ప్యూరీని మిక్స్ చేస్తారు.
ఆపై దానిలో షుగర్, కార్న్‌ఫ్లోర్, నట్స్ వేసి మిక్స్ చేసి హల్వా తయారుచేస్తారు. ఈ రీల్‌కు ఇప్పటివరకూ ఏకంగా 4.9 కోట్ల వ్యూస్ లభించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. మీ ఒరిజినల్ రియాక్షన్‌కు హ్యాట్సాఫ్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, క్లోరోఫిల్ హల్వా అని ఓ యూజర్ రాసుకొచ్చారు. హల్క్ హల్వా అని ఓయూజర్ కామెంట్ చేశారు. అతడి రియాక్షన్ టేస్ట్‌ను తెలుపుతోందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Loksabha Elections 2024 | నా గెలుపుతో బహిష్కరణకు దీటైన సమాధానం ఇస్తా : మహువ మొయిత్ర
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

