Vladimir Putin : అమెరికా సుంకాల భారం మోపుతున్న నేపథ్యంలో భారత్ మిత్రదేశాలైన రష్యా, చైనాతో ఆర్దిక సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) భేటీ త్వరలోనే వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ను కలువనున్నారు. ఇదివరకే మోడీ అహ్వానం అందుకున్న పుతిన్ ఈ ఏడాది ఆఖర్లో భారత్‌కు రానున్నారు. ఈ విషయమై ఇప్పటికే క్రెమ్లిన్ స్పష్టత ఇచ్చింది. డిసెంబర్లో రష్యా అధినేత ఇండియా వస్తారని సమాచారం. అధికారికంగా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. 50శాతం టారీఫ్‌లు విధించడంతో ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టాలని భావించిన ప్రధాని మోడీ రష్యాతో బంధాన్ని పటిష్టం చేసుకోవాలని భావించారు. అందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌లు రష్యా వెళ్లి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు.
Russian President #VladimirPutin will pay an official visit to #India in December, the #Kremlin confirmed
Read more 🔗 https://t.co/4qVeARO97d pic.twitter.com/8j9R0lBqeV
— The Times Of India (@timesofindia) August 29, 2025
ప్రస్తుతం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటున్న భారత ప్రధాని సెప్టెంబర్ 1న పుతిన్‌తో భేటీ కానున్నారు. ఆ సందర్భంగా ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి.. డిసెంబర్ పర్యటన గురించి ప్రస్తావన వచ్చే అవకాశముంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ మొదటిసారి భారత్‌కు విచ్చేయనున్నారు.