చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వీకే శశికళ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి తిరిగి ప్రవేశించే సమయం వచ్చిందన్నారు. అందర్నీ ఏకతాటికిపైకి తీసుకొచ్చి, తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ఆమె ప్రకటించారు. లోక్సభలో ఘోర ఓటమి తర్వాత.. ఏఐఏడీఎంకే పతనమైందని భావించలేమని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించటం ద్వారా అమ్మ పాలనకు నాంది పలుకుతామంటూ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా పళనిస్వామి అధికార పక్షాన్ని సరిగా ప్రశ్నించటం లేదని, ఆ లోటును తాను భర్తిచేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.