Vivek Agnihotri | బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు యత్నించగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. రోజురోజుకీ పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య సోమవారం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. నిరసన తెలిపేందుకు వచ్చిన ఆందోళనకారులు, విద్యార్థులు విప్లవకారులు కాదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘క్షమించాలి మీడియా, బంగ్లాదేశ్ వీధుల్లో ఉన్న ప్రజలు, విద్యార్థులు విప్లవకారులు కాదు. వారిలో దుండగులు, ఆకలితో అలమటించే వారు ఏదో దోచుకోవాలని చూస్తున్నారు.
విప్లవకారులు అని పిలువబడే చాలా మంది వాస్తవానికి పేద, ఆకలితో అలమటించే ప్రజలు. విప్లవం తర్వాత వారి జీవితాలు మారుతాయని నమ్ముతారు. కానీ, ఇది ఎప్పటికీ జరుగదు. మిగతావారు ప్రేక్షకులు. ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నారు. అలాంటి వారు గదిలో కూర్చొని విప్లవాలను చూసేందుకు ఇష్టపడుతారు. నెట్‌ఫ్లిక్స్ నుంచి మంచి బ్రేక్. ఏ తిరుగుబాటు జరిగినా పాత విగ్రహాలను కూల్చేస్తారు. కానీ, నిలబెట్టేందుకు కొత్త విగ్రహాలు లేవన్నది ఆధునిక ప్రపంచ బాధాకరమైన కథ’ అని పేర్కొన్నారు. ఆయన చేసిన పోస్ట్‌కు పలువురు అభిమానులు మద్దతు తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమైన ఘటన అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరో యూజర్ వివేక్ జీ వారు బంగ్లాదేశ్ సాధారణ ప్రజలు.. నిరసన తెలుపుతున్నారని మరో యూజర్ రాసుకొచ్చారు. బలవంతంతోనే ఆందోళన చేయాలంటూ మరో యూజర్ పేర్కొన్నారు.
Sorry, media, but all those mobs on the streets of Bangladesh are neither students nor revolutionaries. Many of them are thugs and hungry people waiting to loot something.
Most revolutions fail because many so-called revolutionaries are actually poor and hungry people who… pic.twitter.com/Hip3F2lWeg
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 6, 2024