శ్రీనగర్ : అమర్నాథ్లో ఇవాళ సాయంత్రం ఆకస్మికంగా వరదలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో దిగువన ఉన్న భక్తుల గుడారాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వరద నేపథ్యంలో గుడారాలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. పలువురు భక్తులు కూడా వరద నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి వర్షం ఆగిపోయిందని ఐటీబీపీ జవాన్లు పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది నిమగ్నమయ్యారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరణాలపై ఇంకా స్పష్టత రాలేదని ఐటీబీపీ జవాన్లు స్పష్టం చేశారు. వరద సంభవించిన సమయంలో అక్కడ సుమారు 12 వేల మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported. Rescue operation underway by NDRF, SDRF & other agencies
(Source: ITBP) pic.twitter.com/o6qsQ8S6iI
— ANI (@ANI) July 8, 2022